బెజవాడలో దంచి కొడుతున్న వర్షం.. కొండచరియలు విరిగి పడి?

విజయవాడలో ఎడతెగని వర్షం కురుస్తుంది. విజయవాడలోని సున్నపు బట్టీల సెంటర్ లో మొగల్రాజపురంలో కొండచరియలు విరిగిపడ్డాయి

Update: 2024-08-31 04:22 GMT

విజయవాడలో ఎడతెగని వర్షం కురుస్తుంది. విజయవాడలోని సున్నపు బట్టీల సెంటర్ లో మొగల్రాజపురంలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఒక ఇల్లు పూర్తిగా దెబ్బతినింది. ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. అయితే సహాయక చర్యలు ప్రారంభించారు. శిధిలాల కింద మరో ఇద్దరు ఉన్నట్లు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. కొండచరియలు కింద ఇళ్లలో ఉన్నవారని అధికారుులు ఖాళీ చేస్తున్నారు.

మూడు రోజుల పాటు...
ఎడతెరిపి లేకుండా బెజవాడలో భారీ వర్షం నిన్నటి నుంచి కురుస్తుండటంతో అధికారులను మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ అలెర్ట్ చేశారు. నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర తో ఫోన్ లో మాట్లాడి కురుస్తున్న వర్షంతో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు.లోతట్టు ప్రాంతాలు,రోడ్లపై నీరు నిలవకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. డ్రైనేజీ లలో నీరు పారుదల కు ఆటంకాలు లేకుండా సిబ్బందిని అప్రమత్తం చేయాలని సూచించారు. మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.


Tags:    

Similar News