ఏపీ నుంచి రాజ్యసభ అభ్యర్థులు ముగ్గురు వీరే
నేటి నుంచి రాజ్యసభ ఎన్నికకు నామినేషన్ దాఖలుకు అవకాశం ఏర్పడింది
నేటి నుంచి రాజ్యసభ ఎన్నికకు నామినేషన్ దాఖలుకు అవకాశం ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ అయ్యాయి. అయితే ఈ మూడు రాజ్యసభ స్థానాలకు సంబంధించి ఇప్పటికే కూటమి నేతలు కసరత్తులు పూర్తి చేసినట్లు తెలిసింది. నిన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ లు సమావేశమై రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై చర్చించారు.
ఖరారయినట్లుగా...
అయితే దీనిపై ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. నామినేషన్ల ముగింపు గడువు ఈ నెల 10వ తేదీ వరకూ ఉంది. రాజ్యసభ కూటమి పార్టీ అభ్యర్థులుగా బీద మస్తాన్ రావు, సానా సతీష్ లతో పాటు బీజేపీ నుంచి ఆర్. కృష్ణయ్య పేరు కూడా ఖరారయినట్లు తెలిసింది. ఈ మూడు పేర్లను త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి