ఈ రెండు పథకాలు నాకు సంతోషాన్నిస్తాయి
గనన్న విద్యాదీవెన పథకం కింద నిధులను లబ్దిదారుల ఖాతాల్లో జగన్ నేరుగా జమ చేశారు
ప్రతి త్రైమాసికంలో ఫీజు రీఎంబర్స్ మెంట్ చెల్లిస్తామని ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. జగనన్న విద్యాదీవెన పథకం కింద నిధులను లబ్దిదారుల ఖాతాల్లో జగన్ నేరుగా జమ చేశారు. వారి ఖాతాల్లో 709 కోట్ల నగదును జమ చేశారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ చదువుల కోసం ఎవరూ అప్పుల కాకూడదన్నదే ప్రభుత్వ ఆలోచన అని చెప్పారు. అర్హులైన ప్రతి పేద విద్యార్థికి ఫీజు రీఎంబర్స్ మెంట్ పథకాన్ని వర్తింప చేస్తామని చెప్పారు. ఒక కుటుంబంలో ఎంతమంది పిల్లలున్నా అందరికీ ఈ పథకం వర్తిస్తుందని జగన్ చెప్పారు.
పేదరికం దూరం....
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో విద్యావిధానాన్ని సమూలంగా మార్పులు చేస్తున్నామని చెప్పారు. పేదలకు కార్పొరేట్ విద్యను అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు. దీనివల్ల 10.82 లక్షల మంది విద్యార్థులు లబ్ది పొందుతున్నారని చెప్పారు. ఇప్పటికే ఈ పథకం కింద 6,969 కోట్లు లబ్దిదారుల ఖాతాల్లో నేరుగా జమ చేశామని జగన్ చెప్పారు. చదువును ఆస్తిగా పరిగణించాలని జగన్ అభిప్రాయపడ్డారు. విద్యాదీవెన, వసతి దీవెన ఎంతో సంతోషానిచ్చే పథకాలని, చదువు ద్వారా వారి జీవనస్థిితిలో మార్పులు తీసుకురావచ్చని, పేదరికం నుంచి దూరం చేయవచ్చని జగన్ అభిప్రాయపడ్డారు.