విస్తరణ వాయిదా.. అందుకే
ఉగాది రోజు కొత్త జిల్లాల ఏర్పాటు ఉండటంతో మంత్రి వర్గ విస్తరణ వాయిదా వేయాలని జగన్ నిర్ణయించారు.
ఏపీ కేబినెట్ విస్తరణ ఉగాదికి జరిగే అవకాశాలు లేవు. అదే రోజు కొత్త జిల్లాల ఏర్పాటు ఉండటంతో మంత్రి వర్గ విస్తరణ వాయిదా వేయాలని జగన్ నిర్ణయించారు. ఈ మేరకు ఆయన వైఎస్సార్సీపీఎల్పీలో కొంత క్లారిటీ ఇచ్చారు. మంత్రివర్గ విస్తరణ అనేది ఖచ్చితంగా ఉంటుందని, అందుకు అందరూ సిద్ధంగా ఉండాలని కోరారు. తొలుత ఉగాది రోజు మంత్రివర్గ విస్తరణ చేయాలనుకున్నారు. మార్చి 27వ తేదీన మంత్రుల చేత రాజీనామాలు చేయించాలని భావించారు.
ప్లీనరీ తర్వాతనే....
కానీ ఉగాది రోజున కొత్త జిల్లాల ఏర్పాటు ఉండటంతో మంత్రులంతా ఆ యా జిల్లాల్లో ఉండాల్సి ఉంటుంది. అందుకోసమే ఈ విస్తరణను కొంతకాలం పాటు వాయిదా వేశారని తెలిసింది. వైసీపీ ప్లీనరీ జులై 8వ తేదీన జరుగుతుంది. ప్లీనరీ తర్వాతనే విస్తరణ ఉండే అవకాశాలున్నాయని చెబుతున్నారు. మంత్రి వర్గ విస్తరణ అయితే గ్యారంటీ అని జగన్ చెప్పారు. అది ఎప్పుడనేది త్వరలోనే తేలనుంది. రాజీనామా చేసిన మంత్రుల సేవలను పార్టీకి వినియోగించుకుంటామని జగన్ చెప్పారు.