Pawan Kalyan : రేపటి నుంచి పవన్ జిల్లాల పర్యటనలు
జనసేన అధినేత పవన్ కల్యాణ్ రానున్న ఎన్నికలను సవాల్ గా తీసుకున్నారు. రేపటి నుంచి జిల్లాల పర్యటన చేస్తున్నారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ రానున్న ఎన్నికలను సవాల్ గా తీసుకున్నారు. సుడిగాలి పర్యటనలు చేస్తూ క్యాడర్ లో ఉత్సాహం నింపాలన్న ప్రయత్నంలో పవన్ కల్యాణ్ ఉన్నారు. ఆయన జిల్లాల పర్యటనపై ప్రణాళికను రూపొందించారు. ఇందుకోసం ప్రత్యేక హెలికాప్టర్ సిద్దం చేశారు. 175 నియోజకవర్గాల్లో హెలికాప్టర్ ల్యాండింగ్‍కు అనువైన ప్రదేశాలు గుర్తిస్తున్నారు. ప్రతి జిల్లాలో పవన్ కల్యాణ్ మూడుు సార్లు పర్యటించాలని పవన్ నిర్ణయించారు.
రేపు భీమవరంలో....
తొలి విడత పర్యటనలో జిల్లాల ముఖ్యనేతలతో సమీక్షలు ఉంటాయని చెబుతున్నారు. రేపటి నుంచి గోదావరి జిల్లాల్లో పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు. నాలుగు రోజుల పాటు గోదావరి జిల్లాల్లో ముఖ్యనేతలతో సమీక్షలు నిర్వహిస్తారు. రేపు భీమవరంలో పశ్చిమ గోదావరి జిల్లా నేతలతో సమీక్షలు చేయనున్నారు. 5న అమలాపురంలో తూర్పు గోదావరి జిల్లా నేతలతో పవన్ భేటీ అవుతారు. ఈనెల 16న కాకినాడలో మరోసారి సమీక్ష నిర్వహించనుననారు. ఈనెల 17న రాజమండ్రిలో పార్టీ నేతలతో పవన్ సమావేశం అవుతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.