Pawan Kalyan : పింఛన్ పంపిణీపై పవన్ ఏమన్నారంటే?

పింఛన్ల పంపిణీపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. ఆయన ఎక్స్ వేదికగా పింఛన్లు జరుగుతున్న విధానాన్ని ప్రశ్నించారు

Update: 2024-04-03 14:16 GMT

పింఛన్ల పంపిణీపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. ఆయన ఎక్స్ వేదికగా పింఛన్లు జరుగుతున్న విధానాన్ని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శికి ఆయన తన ప్రశ్ననుం సంధించారు. వృద్ధులు, దివ్యాంగులకు ఇళ్ల వద్ద పింఛను పంపిణీ చేయడానికి వచ్చిన ఇబ్బంది ఏమిటని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. సినిమా రిలీజ్ అయితే ధియేటర్ల దర్గర రెవెన్యూ ఉద్యోగులకు డ్యూటీ వేస్తారని, ఇప్పుడు పింఛన్లు పంపిణీ చేయడానికి ఏమి వచ్చిందని ఆయన నిలదీశారు.

మద్యం దుకాణాల వద్ద...
చివరకు కరోనా సమయంలో మద్యం షాపుల దగ్గర కూడా డ్యూటీలు వేసి విక్రయించిన విషయాలను మర్చిపోయారా? అని అననారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు, గ్రామ రెవెన్యూ యంత్రాంగం ద్వారా పింఛన్లు పంపిణీ చేయాలని ఆయన కోరారు. వైసీపీ నాయకులు చేసే మెలో డ్రామాలకీ, టైమ్ గేమ్స్ కి ప్రభుత్వ నిర్ణయాలు బలం చేకూరుస్తున్నాయన్నారు. పింఛన్లు తీసుకునే వృద్ధులు, వికలాంగులకు తోడుగా నిలబడాలని జనసైనికులకు ఆయన విజ్ఞప్తి చేశారు.


Tags:    

Similar News