12 నుంచి పవన్ యాత్ర షురూ
ఈ నెల 12 నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించనున్నారు;
ఈ నెల 12 నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించనున్నారు. రైతు కుటుంబాల పరామర్శ యాత్ర పేరుతో జిల్లాలను చుట్టి రావాలని పవన్ భావిస్తున్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను నేరుగా పవన్ కల్యాణ్ పరామర్శించాలని నిర్ణయించారు. ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు లక్ష రూపాలయ ఆర్థిక సాయాన్ని ఇప్పటికే పవన్ ప్రకటించారు.
అనంతపురం నుంచి....
ఈ నెల 12 నుంచి అనంతపురం జిల్లా నుంచి రైతు కుటుంబాల పరామర్శ యాత్ర ప్రారంభమవుతుందని, ఇందులో పవన్ కల్యాణ్ పాల్గొంటారని చెప్పారు. జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశం మంగళగిరిలో జరిగింది. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాల పరామర్శ యాత్ర పేరుతో పవన్ ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించారు.