నేటి నుంచి జనసేన సభ్యత్వ నమోదు

జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమం నేటి నుంచి ప్రారంభం కానుంది;

Update: 2022-03-20 00:53 GMT

జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమం నేటి నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటికే ఐదు లక్షలు దాటిన జనసేన సభ్యత్వాన్ని మరింత పెంచాలని పార్టీ అధినాయకత్వం నిర్ణయించింది. ఇటీవల జనసేన ఆవిర్భావ సభలోనూ పవన్ కల్యాణ‌్ సభ్యత్వ నమోదు కార్యక్రమంపై మాట్లాడారు. ప్రతి ఒక్కరూ జనసేన సభ్యత్వ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.

వాలంటీర్లు....
జనసేన సభ్యత్వ కార్యక్రమం ఈరోజు ప్రారంభమై వారం రోజుల పాటు జరగనుంది. ఈ నెల 27వ తేదీ వరకూ సభ్యత్వ కార్యక్రమం ఉంటుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. గతంలో చేరలేకపోయిన వారంతా ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చని నేతలు తెలిపారు. పార్టీ సభ్యత్వ నమోదు కోసం 3,500 మంది వాలంటీర్లు పనిచేస్తున్నారు.


Tags:    

Similar News