జేసీ, ఆదిలకు సీఎంవో నుంచి పిలుపు

జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డికి ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి పిలుపు వచ్చింది

Update: 2024-11-28 05:43 GMT

జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డికి ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి పిలుపు వచ్చింది. రేపు సీఎంవో కార్యాలయానికి రావాలంటూ ఇద్దరు నేతలకు ఆదేశాలు జారీ అయ్యారు. గత మూడు రోజులుగా కడప జిల్లాలో ఇద్దరి నేతల మధ్య ఫ్లైయాష్ వివాదం జరుగుతుంది. ఇది కూటమి ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారడంతో ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి పిలుపు వచ్చింది.

రేపు రావాలంటూ...
నిన్న ఇద్దరు నేతలకు వార్నింగ్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చినప్పటికీ ఇద్దరూ వెనక్కు తగ్గకపోవడంతో వారితో నేరుగా మాట్లాడాలని ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి పిలుపు వచ్చింది. ఈరోజు నారావారిపల్లిలో చంద్రబాబు ఉండటంతో రేపు అమరావతికి రావాలని ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి పిలుపు వచ్చింది.


Tags:    

Similar News