Leopard : నెల్లూరు జిల్లాలో చిరుతపులి సంచారం

నెల్లూరు జిల్లా పెంచలకోన ప్రాంతంతో పులి సంచరిస్తుండటంతో స్థానికులు అటవీ శాఖ అధికారులు సమాచారం ఇచ్చారు

Update: 2024-11-28 04:33 GMT

నెల్లూరు జిల్లాలో చిరుతపులి సంచారం కలకలం రేపుతుంది. పెంచలకోన ప్రాంతంతో పులి సంచరిస్తుండటంతో స్థానికులు అటవీ శాఖ అధికారులు సమాచారం ఇచ్చారు. రహదారిని దాటుతూ వాహనాలు రావడంతో చిరుతపులి పక్కకు పారిపోయిందని స్థానికులు చెబుతున్నారు. చిరుతపులి సంచారాన్ని స్థానికులు వీడియో తీయడంతో అది అక్కడే ఉండవచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

రోడ్డు దాటుతూ....
ఈ నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు కూడా అక్కడకు వచ్చి చిరుత పులి సంచారం నిజమేనని ధృవీకరించారు. ఈ ప్రాంతంలో రాత్రి వేళ ఒంటరిగా ఎవరూ వెళ్లవద్దని సూచించారు. చిరుతపులి అటవీ ప్రాంతంలోకి వెళ్లి ఉంటుందని అటవీ శాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు చిరుతపులి సంచారంతో స్థానికులు భయాందోళనలతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.


Tags:    

Similar News