పవన్ కళ్యాణ్ కంటే నేనే బెటర్ అని ఆ నేత అన్నారు: కేఏ పాల్

విశాఖపట్నం స్థానం నుంచి ఎంపీగా పోటీ చేస్తానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు

Update: 2023-10-28 10:36 GMT

విశాఖపట్నం స్థానం నుంచి ఎంపీగా పోటీ చేస్తానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తెలిపారు. తెలంగాణ ప్రజలు కూడా తనను కోరుకుంటున్నారని, కేసీఆర్ పాలన పోయి, కేఏ పాల్ పాలన రావాలని ఆకాంక్షిస్తున్నారని అన్నారు. విశాఖ ఎంపీగా పోటీ చేయబోతున్న తనకు అన్ని వర్గాల ప్రజల మద్దతు ఉందని చెప్పారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కంటే తానే బెటర్ అని విశాఖ వైసీపీ ఎంపీ ఎంవీవీ చెప్పారని తెలిపారు. నవంబర్ 9వ తేదీన విశాఖలో గ్లోబల్ క్రిస్మస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని, 200 దేశాలకు ఇక్కడి నుంచి సందేశాన్ని ఇవ్వబోతున్నానని కేఏ పాల్ తెలిపారు. ఈ కార్యక్రమానికి అందరూ హాజరు కావాలని, భోజనం చేసి వెళ్లాలని కోరారు. ప్రజాశాంతి పార్టీ లోకి కొంతమంది బీసీ నేతలు చేరారు. ఆ పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఎంపీగా పోటీ చేస్తున్న తనకు ప్రజల అందరి మద్దతు ఉందన్నారు.

అంతకు ముందు రోజు కేఏ పాల్ విశాఖ పోలీస్ కమిషనర్‌ రవిశంకర్ అయ్యన్నార్‌ను కలిశారు. సోషల్ మీడియాలో తన ఫోటోలను మార్ఫింగ్ చేయడంపై ఫిర్యాదు చేశారు. మార్పింగ్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ నెల 23న రాజమహేంద్రవరంలో జరిగిన టీడీపీ జనసేన పార్టీల సమన్వయ కమిటీ సమావేశంలో నారా లోకేష్ -పవన్ కళ్యాణ్ భేటీ ఫోటోలు మార్ఫింగ్ చేశారని.. ఇద్దరు నేతల మధ్య చర్చలు కేఏ పాల్ ఆధ్వర్యంలో జరిగినట్లు ఫోటో సృష్టించి సోషల్ మీడియాలో తనను కించపరిచారన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను సీపీకి అందజేశారు.


Tags:    

Similar News