విశాఖ డగ్ర్స్ కేసులో వీడిన చిక్కుముడి
విశాఖ పోర్టులో ఇరవై ఐదు వేల టన్నుల డ్రగ్స్ కేసులో కీలక సమాచారం అందింది.
విశాఖ పోర్టులో ఇరవై ఐదు వేల టన్నుల డ్రగ్స్ కేసులో కీలక సమాచారం అందింది. ఈ ఏడాది మార్చిలో విశాఖకు ఒక షిప్ లో పెద్దయెత్తున డ్రగ్స్ వచ్చాయని రాజకీయ ఆరోపణలు తలెత్తాయి. ఎన్నికలకు ముందు కావడంతో కంటైనర్ లో వచ్చినవి డ్రగ్స్ అంటూ ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకున్నారు. అయితే దీనిపై సీబీఐ అధికారులు విచారణ చేశారు.
కోర్టుకు చెప్పిన అధికారులు...
ఈ మేరకు సీబీఐ అధికారులు కోర్టుకు తేల్చిచెప్పారు. విశాఖ కంటైనర్ లో ఎటువంటి డ్రగ్స్ లేవని, వాటి నమూనాలను పరీక్షించిన తర్వాత అవి డ్రగ్స్ కాదని తేలిందన్నారు. ఆ 25 వేల టన్నులు డ్రై ఈస్ట్ అని సీబీఐ అధికారులు పేర్కొన్నారు. ఆ కంటైనర్ ను వినియోగించుకోవచ్చని కోర్టు కూడా ఆదేశాలు జారీ చేయడంతో విశాఖల డ్రగ్స్ కేసులో చిక్కుముడి వీడింది.