నేడు జగన్ ఏం చెబుతారో.. అదే హట్ టాపిక్
ఈరోజు వైసీపీ కీలక సమావేశం జరగనుంది. వైసీపీ సర్వసభ్య సమావేశం జరగనుంది.
ఈరోజు వైసీపీ కీలక సమావేశం జరగనుంది. వైసీపీ సర్వసభ్య సమావేశం జరగనుంది. ఎన్నికలకు ఇంకా సమయం ఉండగానే పార్టీ శ్రేణులను అప్రమత్తం చేసేందుకు వైసీపీ చీఫ్ జగన్ సిద్ధమయ్యారు. పార్టీ శ్రేణులకు ఈ సమావేశంలో దిశానిర్దేశం చేయనున్నారు. ఉదయం 9.30 గంటలకు సమావేశం ప్రారంభం కానుంది. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈ కీలక సమావేశం జరగనుంది. ప్రతి నిధుల సభకు తొలిసారి బార్ కోడింగ్ పాస్ లను జారీ చేశారు.
ఎన్నికల వ్యూహంతో పాటు...
ఈ సమావేశానికి మొత్తం 8,500 మంద్రి ప్రతినిధులు హాజరవుతున్నారు. కైవలం పాస్‌లు ఉన్నవారినే సమావేశానికి అనుమతిస్తారు. వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంతో పాటు వై నాట్ 175 అంటూ నినాదాన్ని మరోసారి జగన్ ఈ సమావేశంలో వినిపించనున్నారు. గత నాలుగున్నరేళ్లుగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో పాటు జిల్లాల విభజన, అభివృద్ధి, మెడికల్ కళాశాలల ఏర్పాటు వంటి అంశాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేలా పార్టీ నేతలను జగన్ సమాయత్తం చేయనున్నారు.
ఎవరికి సీటు ఇచ్చినా...
ఈ సమావేశానికి పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గాల ఇన్‌ఛార్జులు, ప్రాంతీయ సమన్వయకర్తలు, జల్లా పార్టీ అధ్యక్షులు, జడ్పీటీసీ, ఎంపీపీ, మున్సిపల్ ఛైర్మన్లు కూడా హాజరు కానున్నారు. ప్రత్యర్థి పార్టీలన్నీ ఏకమై కలసి వస్తున్న తరుణంలో ఏ విషయంలో వైసీపీ జాగ్రత్తలు తీసుకోవాలి? ఏ ఏ వర్గాలను ఆకట్టుకునేలా చర్యలు తీసుకోవాలన్న దానిపై జగన్ నేతలకు క్లాస్ పీకనున్నారు. సర్వే నివేదికల ప్రకారమే సీట్ల కేటాయింపు ఉంటుందని మరోసారి జగన్ స్పష్టం చేయనున్నారు. అభ్యర్థి ఎవరైనా ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయించేలా పార్టీ శ్రేణులు కష్టించి పనిచేసేలా వారిని సిద్ధం చేయనున్నారు. దీంతో ఎన్నికలకు ముందు ఈ సమావేశం కీలకంగా మారనుంది.