కోడెల శివరామ్ కోపం వాళ్లపైనేనా?

సత్తెనపల్లి టీడీపీలో చాలా వర్గాలు ఉండడంతో అక్కడ టీడీపీకి కలిసి వచ్చేలా లేదు.

Update: 2023-08-02 08:18 GMT

సత్తెనపల్లి టీడీపీలో చాలా వర్గాలు ఉండడంతో అక్కడ టీడీపీకి కలిసి వచ్చేలా లేదు. ఇంతకు ముందు బీజేపీలో ఉన్న కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలోకి చేరిపోవడం.. సత్తెనపల్లి ఇంఛార్జ్‌గా టీడీపీ అధినేత నియమించడం చక చకా జరిగిపోయాయి. ఇక తాజాగా మరో వివాదం టీడీపీలో ఉన్న గొడవలను తట్టిలేపినట్లు అయింది. పార్టీ కార్యక్రమాల్లో కోడెల శివరామ్‌, ఆయన అనుచరులు యాక్టివ్‌ లేరని అందుకు తగిన కారణాలు చెప్పాలంటూ 16మందికి నోటీసులిచ్చింది టీడీపీ అధిష్టానం.

ఈ నోటీసులపై కోడెల శివరామ్‌ ఫైర్ అవ్వడమే కాకుండా.. హైకమాండ్‌ పై విమర్శలు గుప్పించారు. దశాబ్దాలుగా పార్టీ అభివృద్దికి కష్టపడిన వాళ్లకు నోటీసులివ్వడం కరెక్ట్ కాదని అన్నారు కోడెల శివరామ్‌. చిలకలూరిపేట, నర్సరావుపేట, గురజాలలో చాలామంది టికెట్స్ ఆశిస్తున్నారు. వాళ్లంతా లోకేష్ ఎదుటే కొట్టుకున్నారు. వాళ్లకు ఇవ్వకుండా తనకు నోటీసులివ్వడమేంటని ప్రశ్నించారు. టీడీపీ ఆఫీస్‌ ప్రారంభించినప్పటి నుంచి కన్నా అందులోకి వెళ్లనే లేదు. ఆయనకు నోటీసులివ్వకుండా తనకు ఇవ్వడమేమిటని ప్రశ్నించారు శివరామ్‌. కన్నా ఎంట్రీ కోడెల శివ రామ్ వర్గానికి ఏ మాత్రం నచ్చడం లేదని ప్రస్తుత పరిస్థితులను చూస్తే స్పష్టమవుతూ ఉంది. రాజకీయాలకు అతీతంగా ప్రజలకు ఉండగా ఉంటానని మాత్రం శివరామ్‌ చెప్పుకుంటూ వస్తున్నారు. ఇప్పటికే సరైన గుర్తింపు దక్కడం లేదని శివరామ్ అనుచరులు అనుకుంటూ ఉండగా.. కొత్తగా ఈ నోటీసులు కన్నాకు వారిని మరింత దూరం చేసేవిలా ఉన్నాయి.


Tags:    

Similar News