Leopard : ఆ ..చిరుత అక్కడే ఉందట...అలర్ట్‌గా ఉండాల్సిందే

తూర్పు గోదావరి జిల్లా కడియం నర్సరీలో చిరుతపులి సంచరిస్తుంది. చిరుతపులి అక్కడే ఉన్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు.

Update: 2024-09-26 06:00 GMT

తూర్పు గోదావరి జిల్లా కడియం నర్సరీలో చిరుతపులి సంచరిస్తుంది. చిరుతపులి అక్కడే ఉన్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. చిరుతను బంధించేందుకు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. చిరుతపులి పాదముద్రల సందర్భంగా అది అక్కడే ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కడియం నర్సరీలోకి రైతులు, కూలీలు వచ్చేందుకే భయపడిపోతున్నారు. చిరుతపులి ఆచూకీ కోసం డ్రోన్ కెమెరాలను వినియోగిస్తున్నారు.

ఎవరూ ఉండొద్దంటూ...
కడియం నర్సరీ రైతులను సాయంత్రం నాలుగు గంటలకు అక్కడి నుంచి వెళ్లిపోవాలని, ఉదయం సూర్యుడు వచ్చిన తర్వాతనే నర్సరీకి రావాలని రైతులకు,కూలీలకు అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే ఈ చిరుత పులి వంద కిలో మీటర్ల వేగంతో ప్రయాణిస్తుందని, అది లంక గ్రామాలకు వెళ్లే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. మండపేట, ఆలమూరు ప్రాంతాల వైపు వెళ్లేందుకు కూడా అవకాశముందని చెబుతున్నారు. చిరుతను బంధించడానికి బోన్లను సిద్ధం చేశారు. మత్తు మందు కూడా అధికారులు సిద్ధం చేశారు.


Tags:    

Similar News