18వ రోజుకు చేరిన రైతుల మహా పాదయాత్ర
రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంలూ రైతులు చేస్తున్న మహా పాదయాత్ర నేటికి 18వ రోజుకు చేరుకుంది.;
రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంలూ రైతులు చేస్తున్న మహా పాదయాత్ర నేటికి 18వ రోజుకు చేరుకుంది. నేడు నెల్లూరు జిల్లాలోకి యాత్ర ప్రవేశించనుంది. ఇప్పటి వరకూ గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో పాదయాత్ర కొనసాగింది. పాదయాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తుందని రైతులు చెబుతున్నారు. గ్రామాల్లో ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి తమకు సంఘీభావం తెలుపుతున్నారని వారు అంటున్నారు.
నేడు నెల్లూరు జిల్లాలోకి..
ఈరోజు ప్రకాశం జిల్లా గుడ్లూరు లో ప్రారంభమయ్యే యాత్ర సాయంత్రానికి నెల్లూరు చేరుకుంటుంది. ఈరోజు నెల్లూరు జిల్లా చింతలపాలెం వద్ద యాత్రను ముగిస్తారు. డిసెంబరు 15వ తేదీ నాటికి పాదయాత్ర తిరుపతికి చేరుకుంటుందని నిర్వాహకులు చెబుతున్నారు.