వరద బాధితుల ఆకలిని తీర్చిన ఆలయాలు

వరదల సమయంలో సర్వం కోల్పోయిన వారికి అనేక మంది ముందుకు వచ్చి తమ వంతు సాయం చేస్తున్నారు;

Update: 2024-09-06 03:29 GMT

వరదల సమయంలో సర్వం కోల్పోయిన వారికి అనేక మంది ముందుకు వచ్చి తమ వంతు సాయం చేస్తున్నారు. స్వచ్ఛంద సేవా సంస్థలతో పాటు ప్రయివేటు సంస్థలు వరద బాధితుల ఆకలి తీర్చేందుకు పెద్ద సంఖ్యలో విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకు వచ్చాయి. అందరితో పాటు తాము కూడా అంటూ ఆలయాలు కూడా తమ వంతుగా ప్రసాదంతో వరద బాధితుల కడుపులను నింపేందుకు ప్రయత్నించడం హర్షణీయమైన విషయం.

దేవాలయాల నుంచి...
విజయవాడలోని వరద బాధితుల ఆకలిని తీర్చేందుకు రాష్ట్రంలోని అనేక దేవాలయాలు ముందుకొచ్చాయి. ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గమ్మ ఆలయం నుంచి ఈరోజు వరకూ రెండు లక్షల ఆహార ప్యాకెట్లు, 2.5 లక్షల వాటర్ బాటిళ్లు అందించింది. సింహాచలం దేవస్థానం 90వేల ఫుడ్ ప్యాకెట్స్, 50 వేల నీళ్ల బాటిళ్లు సరఫరా చేసింది. ద్వారకా తిరుమల ఆలయ నిర్వాహకులు 31వేల ప్యాకెట్ల ఆహారం, 35వేల వాటర్ బాటిళ్లు సరఫరా చేశారు. అలాగే అన్నవరం, అరసవల్లి, మోపిదేవి ఆలయాలు కూడా ఈ సేవా కార్యక్రమంలో పాల్గొన్నాయి.


Tags:    

Similar News