రెండు రాష్ట్రాల అధికారుల కమిటీ నిర్ణయాలివే
రెండు రాష్ట్రాల అధికారుల కమిటీ సమావేశం ముగిసింది. ఈరోజు విజయవాడలో జరిగిన సమావేశానికి చీఫ్ సెక్రటరీలు ఇద్దరూ హాజరయ్యారు
రెండు రాష్ట్రాల అధికారుల కమిటీ సమావేశం ముగిసింది. ఈరోజు విజయవాడలో జరిగిన సమావేశానికి చీఫ్ సెక్రటరీలు ఇద్దరూ హాజరయ్యారు. వివిధ శాఖల ఉన్నతాధికారులు కూడా చర్చల్లో పాలుపంచుకున్నారు. విద్యుత్తు బకాయీల పంచాయతీ మాత్రం తేలలేదు. మూడు అంశాలపై మాత్రం రెండు రాష్ట్రాలు ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది.పన్నుల పంపకాలపై మాత్రం ఒక అవగాహనకు వచ్చినట్లు సమాచారం. అలాగే ఉద్యోగుల మార్పిడి అంశంపై కూడా ఏకాభిప్రాయం కుదిరిందని సమావేశం పూర్తయిన తర్వాత అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.
విద్యుత్తు బకాయీల విషయంలో...
చీఫ్ సెక్రటరీల నేతృత్వంలో సమావేశమైన అధికారుల కమిటీ విద్యుత్తు బకాయీల విషయంపై మాత్రం ఒక క్లారిటీకి రాలేదు. ఉమ్మడి సంస్థల ఖర్చులను తిరిగి చెల్లించే అంశంపై కూడా ప్రధానంగా ఈ సమావేశంలో చర్చించినట్లు సమాచారం. విభజన అంశాలపై చర్చించినప్పటికీ, 9,10 షెడ్యూల్ లో సంస్థల ఆస్తుల పంపకాలపై మాత్రం ఒక నిర్ణయానికి సమావేశం రాలేదని తెలిసింది. మరొక సారి అధికారుల కమిటీ సమావేశం కావాలని నిర్ణయించినట్లు తెలిసింది.