నేడు కేఆర్ఎంబీ సమావేశం
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కమిటీ సమావేశం నేడు జరగనుంది. వర్చువల్ విధానంలో త్రిసభ్య కమిటీ నేడు భేటీ కానుంది.
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కమిటీ సమావేశం నేడు జరగనుంది. వర్చువల్ విధానంలో త్రిసభ్య కమిటీ నేడు భేటీ కానుంది. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ల మధ్య నీటికేటాయింపులపై నిర్ణయం జరగనుంది. శ్రీశైలం జలాశయంలో విద్యుత్ ఉత్పత్తి కోసం నీటిని వినియోగించవద్దని ఇటీవలే కమిటీ రెండు రాష్ట్రాలకు సూచించింది.
శ్రీశైలంలో నీటిని.....
కృష్ణా నదిలో నీటిమట్టం 809 అడుగుల పైన ఉందని, కనిష్ట వినియోగ మట్టాన్ని పరిగణనలోకి తీసుకుంటే 5.2 టీఎంసీలు మాత్రమే ఉంటాయని, వీటిని తాగునీటి అవసరాల కోసం వినియోగించుకోవాలని సూచించింది. విద్యుత్తు ఉత్పత్తికి శ్రీశైలం నీటిని వినియోగించవద్దని కోరింది. దీనికి సంబంధించి నేటి సమావేశంలో క్లారిటీ వచ్చే అవకాశముంది.