జగన్ కు చిరు బర్త్ డే విషెస్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.;

Update: 2021-12-21 07:25 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. జగన్ మోహన్ రెడ్డిగారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు. జగన్ నేడు 49వ పుట్టిన రోజు వేడుకలను జరుపుకుంటున్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో జగన్ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు ముఖ్యనేతలందరూ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

క్యూ కట్టిన నేతలు...
ఇక తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వైసీపీ నేతలు క్యూ కట్టారు. జగన్ చేత కట్ చేయించారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు బాలశైరి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, విజయసాయిరెడ్డి తదితరులు హాజరయ్యారు. చీఫ్ సెక్రటరీ సమీర్ శర్మ తో పాటు ఉన్నతాధికారులు వచ్చారు. మంత్రులందరూ దాదాపు తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి వచ్చి జగన్ కు జన్మదిన శుభాకాంక్షలు అంద చేశారు.


Tags:    

Similar News