Chiranjeevi : పిఠాపురం ప్రజలకు పవన్ విజ్ఞప్తి.. నా తమ్ముడిని గెలిపించండి అంటూ

సినిమాల్లోకి కష్టంగా వచ్చిన పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి మాత్రం ఇష్టంగా వచ్చారని మెగాస్టార్ చిరంజీవి అన్నారు.;

Update: 2024-05-07 06:09 GMT
Chiranjeevi : పిఠాపురం ప్రజలకు పవన్ విజ్ఞప్తి.. నా తమ్ముడిని గెలిపించండి అంటూ
  • whatsapp icon

సినిమాల్లోకి కష్టంగా వచ్చిన పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి మాత్రం ఇష్టంగా వచ్చారని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. అమ్మకడుపున ఆఖరి వాడిగా పుట్టిన కల్యాణ్ ది సేవ చేసే మనస్తత్వమన్నారు. అధికారంలోకి లేకపోయినా ప్రజలకు సేవ అందించాలన్న తపన పవన్ కల్యాణ్ ది అన్నారు. తన గురించి కాకుండా జనం గురించి ఆలోచించే పవన్ కల్యాణ్ ను పిఠాపురం ప్రజలు ఆదరించాలని చిరంజీవి కోరారు. రైతులకు, మత్స్యకారులకు తన సొంత డబ్బులతో ఆదుకున్న వ్యక్తి పవన్ అని ప్రశంసించారు.

చట్ట సభల్లో...
ఏ అన్నకైనా తన తమ్ముడు మాటలు పడుతుంటే బాధేస్తుందన్నారు. తన తల్లి బాధను కూడా తాను చూడలేకపోతున్నారు. తమ్ముడికి అండగా నిలబడటంతో తప్పులేదని భావించి మీ ముందుకు వచ్చానన్నారు. జనం కోసం జనసైనికుడిగా మారాడన్నారు. తన జీవితాన్ని రాజకీయాల కోసం అంకిత మిచ్చే వ్యక్తి అని అన్నారు. చట్టసభల్లో పవన్ కల్యాణ్ గొంతు వినిపించాలంటే జనసేనాని పవన్ కల్యాణ్ ను గెలిపించాలని కోరారు. గాజుగ్లాసు గుర్తుకు మీ ఓటు వేసి పవన్ ను గెలిపించాలని పిఠాపురం ప్రజలను చిరంజీవి కోరారు.


Tags:    

Similar News