Andhra Pradesh : ఏపీ రాజకీయ పార్టీలకు గుడ్ న్యూస్.. రానున్న నాలుగు రోజులు
ఆంధ్రప్రదేశ్ వాసులకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. రానున్న వారం రోజులు నార్మల్ టెంపరేచర్ ఉండే అవకాశముందని తెలిపింది
ఆంధ్రప్రదేశ్ వాసులకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. రానున్న వారం రోజుల పాటు నార్మల్ టెంపరేచర్ ఉండే అవకాశముందని తెలిపింది. ద్రోణి ప్రభావంతో ఆంధ్రన్రదేశ్ వ్యాప్తంగా రానున్న వారం రోజుల పాటు అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. వేసవి కాలంలో ఇవి సీజనల్ రెయిన్స్ అని వాతావరణ శాఖ తెలిపింది.
సాధారణ ఉష్ణోగ్రతలు...
ఉష్ణోగ్రతలు కూడా సాధారణంగానే నమోదు అవుతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఎన్నికలు జరుగుతున్న సమయంలో చల్లటి వాతావరణంతో పోలింగ్ శాతం పెరుగుతుందని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. నార్మల్ టెంపరేచర్ ఉండటంతో వృద్ధులు కూడా పోలింగ్ లో పాల్గొనేందుకు అవకాశముందని లెక్కలు వేసుకుంటున్నాయి. ఈ నెల 13వ తేదీన ఏపీలో ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే.