నేడు కోస్తాంధ్రలో వర్షాలు

నేడు ఆంధ్రప్రదేశ్ లో అక్కడకక్కడ వర్షాలు కురిసే అవకాశముందని వాతవారణ శాఖ వెల్లడించింది.

Update: 2022-03-21 02:13 GMT

నేడు ఆంధ్రప్రదేశ్ లో అక్కడకక్కడ వర్షాలు కురిసే అవకాశముందని వాతవారణ శాఖ వెల్లడించింది. ఆగ్నేయ బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న దక్షిణ అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. వాయుగుండం అండమాన్, నికోబార్ దీవుల వెంట ఉత్తర దిశగా కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది.

తుపానుగా మారి...
ఈ వాయుగుండం పన్నెండు గంటల్లో తుపానుగా మారే అవకాశముంది. దీని ప్రభావంతో కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశముందని వాతవారణ శాఖ తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది.


Tags:    

Similar News