ఏపీలో మరో రెండు రోజులు వర్షాలు

రుతుపవన ద్రోణి దక్షిణ వవైపు మళ్లడం, రుతు పవనాలు చురుగ్గా కదులుతుండటంతో ఏపీ లో వర్షాలు కురుస్తాయిన వాతావరణ శాఖ తెలిపింది.

Update: 2022-07-24 06:53 GMT

రుతుపవన ద్రోణి దక్షిణ వవైపు మళ్లడం, రుతు పవనాలు చురుగ్గా కదులుతుండటంతో ఏపీ లో వర్షాలు కురుస్తాయిన వాతావరణ శాఖ తెలిపింది. ఛత్తీస్‌ఘడ్ పరిసర ప్రాంతాల్లోనూ ఉపరితల ద్రోణి కొనసాగుతుందని పేర్కొంది. దీంతో కోస్తా, రాయలసీమల్లో వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. అనంతరం రెండు మూడు రోజుల్లో అవి భారీ వర్షాలుగా మారతాయని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

ప్రకాశం బ్యారేజీ నుంచి....
ఇక ఏపీలో కురుస్తున్న వర్షాలు, ఎగువ కురుస్తున్న భారీ వర్షాలకు ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద నీరు చేరుతుంది. దీంతో ప్రకాశం బ్యారేజీ వద్ద యాభై గేట్లను అడుగు మేర ఎత్తారు. ఇరవై గేట్లను రెండడుగుల మేర పైకి లేపారు. ప్రకాశం బ్యారేజీ నుంచి ప్రస్తుతం 71,576 క్యూసెక్కుల నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. డెల్టా కాల్వలకు కూడా 5,126 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. తాగునీటి కోసం 5,539 క్యూసెక్కుల నీటిని డెల్టా కాల్వలకు విడుదల చేస్తున్నారు.


Tags:    

Similar News