నేడు కూడా వర్షాలే

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో ఈరోజు కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది

Update: 2022-08-15 02:34 GMT

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఈరోజు కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ అల్పపీడనం, ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరంలో ఏర్పడి అర్థరాత్రికి పశ్చిమ బెంగాల్ లోని దిఘా కు దగ్గరగా వచ్చే అవకాశముందని పేర్కొంది. వాయువ్య బంగాళా ఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారుతుందని తెలిపింది.

వాయుగుండంగా మారడంతో...
ఈ ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశముందని చెప్పింది. కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. అలాగే తెలంగాణలోనూ ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశముందని తెలిపింది. కొన్ని చోట్ల ఆకాశం మేఘావృతమై ఉంటుందని తెలిపింది.


Tags:    

Similar News