భయం భయంగా కోనసీమ
ఒడిశా దాని పరిసర ప్రాంతాల్లో అల్ప పీడనం కేంద్రీకృతమైనందున ఆంధ్రప్రదేశో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.;
ఒకవైపు భారీ వర్షాలు మరో వైపు గోదావరి వరద ఉధృతి కలసి కోనసీమ గ్రామాల్లో ప్రజలు భయపడిపోతున్నారు. ప్రధానంగా లంక గ్రామాల ప్రజలు వణికిపోతున్నారు. తమ గ్రామానికి వరద నీరు ముంచెత్తుతుందన్న భయాందోళనల్లో ప్రజలు ఉన్నారు. కోనసీమ జిలల్లా పి గన్నవరం మండలం బూరుగులంక రేవు వద్ద వశిష్టగోదావరి అనుబంధ పాయలోని తాత్కాలిక దారి తెగిపోవడంతో నాలుగు గ్రామాల ప్రజలు నిలిచిపోయాయి. ఒడిశాతో పాటు దాని పరిసర ప్రాంతాల్లో అల్ప పీడనం కేంద్రీకృతమైనందున ఆంధ్రప్రదేశో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
ప్రాజెక్టులన్నీ ...
భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలతో అధికారులు అప్రమత్తమయ్యారు. కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేశారు. సహాయక బృందాలను సిద్ధం చేశారు. తోటపల్లి జలాశంయ రెండు గేట్లు ఎత్తివేశారు. తుంగభద్ర నది పొంగి ప్రవహిస్తుంది. తుంగభద్ర ప్రాజెక్టులో లక్ష క్యూసెక్కుల నీటి ప్రవాహంవ ఉంది. ప్రస్తుతం 72.951 టీఎంసీల నీరు నిల్వ ఉంది. తుంగభద్ర నిండేందుకు మరో 23 టీఎంసీలు అవసరమని అధికారులు చెబుతున్నారు. ఎప్పుడైనా గేట్లు ఎత్తివేస్తామని అంటున్నారు. పోలవరం ప్రాజెక్టు స్పిల్ వే 48 గేట్లు ఎత్తివేశారు. ధవళేశ్వరం బ్యారేజి వద్ద 1.20 లక్షల క్యూసెక్కుల వరద నీరు ప్రవహిస్తుంది.