Rain Alert : మూడు రోజులు భారీ వర్షాలేనట
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారిందని వాతావరణ శాఖ తెలిపింది
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారిందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రభావంతో మూడు రోజుల పాటు తెలంగాణకు భారీ వర్ష సూచన ఉంటుందని తెలిపింది. తెలంగాణలో పద్దెనిమిది జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు రెడ్ అలెర్ట్ ను అధికారులు జారీ చేశారు. మేడిగడ్డకు భారీ గా వరద నీరు చేరింది. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ కి చెందిన మొత్తం గేట్లను ఎత్తి కిందకు నీటిని వదిలేస్తున్నారు.
పదహారు జిల్లాలకు...
ఆంధ్రప్రదేశ్ లోని 16 జిల్లాలకు భారీ వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ తెలిపింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక జారీ చేసింది. సహాయక చర్యల్లో మూడుSDRF, రెండు NDRF బృందాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా చూడాలని, ప్రతి జిల్లాలో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. భారీ వర్షాలతో గోదావరి పరవళ్లు తొక్కుతుంది. భద్రాచలంలో 33 అడుగుల నీటిమట్టం పెరిగిందని అధికారులు తెలిపారు.