Rain Alert : 24 గంటలు భారీ వర్షాలే.. ఏపీకి అలెర్ట్
రాష్ట్రంలో ఈశాన్య రుతుపవనాల ప్రభావం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 24 గంటలు భారీ వర్షాలు ఏపీలో కురుస్తాయని చెప్పింది
రాష్ట్రంలో ఈశాన్య రుతుపవనాల ప్రభావం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. చెన్నైకి సమీపంలో వాయుగుండం తీరం దాటి బలహీనపడిందని పేర్కొంది. ప్రస్తుతం వాయుగుండం తీవ్ర అల్పపీడనంగా మారిందని చెప్పింది. ఈ ప్రభావంతో రాగల 24 గంటల్లో కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఈ జిల్లాల్లో...
శ్రీకాకుళం, అనకాపల్లి, విశాఖ, విజయనగరం, కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. రాయలసీమలోని అనంతపురం, కడప, చిత్తూరులో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. సముద్రంలో అలల ఉద్ధృతి కొనసాగుతోందని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.