విస్తారంగా వర్షాలు.. రెయిన్ అలర్ట్
ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈరోజు, రేపు రాయలసీమలో ఒకటి, రెండో చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. మిగిలిన చోట తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. గత రెండు రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ లో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. నెల్లూరు, శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, ప్రకాశం, అనంతరం జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. నిన్న ప్రకాశం జిల్లాలోని పొన్నలూరు మండలం చెన్నపాడులో 112.5, నెల్లూరులో 92 మిమీ వర్షపాతం నమోదయిందని వాతావరణ శాఖ వెల్లడించింది.
రేపు, ఎల్లుండి...
ఇక తెలంగాణలోనూ శని, ఆది వారాల్లో వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరింది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం కారణంగా తెలంగాణలోని పశ్చిమ వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయని పేర్కొంది. ఈ నెల 29వ తేదీ వరకూ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది.