కనిష్ట ఉష్ణోగ్రతలు.. వణుకుతున్న జనం
జనవరి నెల రాకముందే ఏజెన్సీ ప్రాంతంలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
జనవరి నెల రాకముందే ఏజెన్సీ ప్రాంతంలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దట్టమైన మంచుతో పాటు చలి పంజా విసురుతుండటంతో మన్యం ప్రజలు బయటకు రాలేకపోతున్నారు. ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోవడంతో ప్రజలు చలికాచుకునేందుకు చలిమంటలను ఆశ్రయిస్తున్నారు. విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల్లోని ఏజెన్సీ ఏరియాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంది.
కనిష్ట స్థాయికి...
మారేడుమిల్లిలో పన్నెండు డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదయింది. ఈ ఏడాదిలో అత్యల్పంగా నమోదయిన ఉష్ణోగ్రత ఇదేనని అధికారులు చెబుతున్నారు. విశాఖ మన్యంలో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కు చేరుకున్నాయి. ఉదయం పదిగంటల వరకూ సూర్యుడు కన్పించడం లేదు. రానున్న కాలంలో చలితీవ్రత మరింత పెరిగే అవకాశముందంటున్నారు.