టెన్త్ లో బాలికలే టాప్
ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పరీక్ష ఫలితాలను మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. ఫలితాల్లో బాలికలదే పైచేయిగా ఉంది.
ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పరీక్ష ఫలితాలను మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. ఫలితాల్లో బాలికలదే పైచేయిగా ఉంది. మొత్తం ఉత్తీర్ణతా శాతం 72.26 శాతంగా ఉంది. 87.47 శాతం రిజల్ట్ తో పార్వతీపురం మన్యం జిల్లా మొదటి స్థానంలో ఉంది. బాలురు 69.27 శాతం మంది, బాలురు చివరి స్థానంలో నంద్యాల జిల్ా ఉంది. బాలుర కంటే బాలికలు 6.11 శాతం అధికంగా ఉత్తీర్ణులయ్యారని బొత్స సత్యనారాయణ తెలిపారు. గత ఏడాది కంటే ఉత్తీర్ణత శాతం పెరిగిందని అన్నారు. ప్రభుత్వ స్కూళ్లలో ఉత్తీర్ణత శాతం పెరిగిందన్నారు. బాలురు 69.27 శాతం మంది బాలికలు 75,38 ఉత్తీర్ణులయ్యారని తెలిపారు.
18 రోజుల్లోనే...
పరీక్షలు పూర్తయిన18 రోజుల్లోనే ఫలితాలు ప్రకటించామని మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. జూన్ 2 నుంచి సప్లెమెంటరీ పరీక్షలు ఉంటాయని, పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు ఆందోళన చెందకుండా సప్లిమెంటరీ పరీక్షలకు హాజరు కావచ్చని తెలిపారు. ఈ నెల 13 వరకూ రీకౌంటింగ్, వెరిఫికేషన్ కు అవకాశముందని తెలిపారు. ఈ నెల 17వ తేదీ వరకూ సప్లిమెంటరీ పరీక్షలకు దరఖాస్తులకు తుది గడువు అని ఆయన తెలిపారు. ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్‌లో 95 శాతం రిజల్ట్ వచ్చాయని బొత్స సత్యనారాయణ వివరించారు.