'పొత్తులు' మా ముందు చిత్తు

రాష్ట్రంలో వైసీపీయేతర పార్టీలన్నీ ఒక్కటై వచ్చినా.. అవన్నీ జగన్‌ ముందు చిత్తు కాక తప్పదని

Update: 2023-08-20 12:28 GMT

రాష్ట్రంలో వైసీపీయేతర పార్టీలన్నీ ఒక్కటై వచ్చినా.. అవన్నీ జగన్‌ ముందు చిత్తు కాక తప్పదని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నిన్న జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను వైసీపీ కైవసం చేసుకున్నప్పటికీ, తెలుగుదేశం పార్టీ అభ్యర్థులే ఘనవిజయాన్ని సాధించినట్లు కొన్ని పత్రికలు బాకా ఊదడాన్ని చూ.. విడ్డూరంగా కనిపించిందని అన్నారు. అప్పుడప్పుడు గెలిచే పార్టీలు ఇలాగే వార్తలు రాయించుకుంటాయని, సంబరాలు చేసుకుంటూ ఉంటాయని, వారి ఆనందాన్ని మేము ఎందుకు కాదంటామని అమర్నాథ్ అన్నారు.

గల్లి క్రికెట్లో గెలిచిన ఆటగాళ్లు వరల్డ్ కప్ కొట్టామంటే ఏ విధంగా ఉంటుందో తెలుగుదేశం పార్టీ తీరు కూడా అలాగే ఉందని ఆయన వ్యాఖ్యానించారు. 2020లో పంచాయతీలు, 2021 లో ఎంపీటీసీలు, జడ్పిటిసిలను వైసీపీ పూర్తిస్థాయిలో గెలుచుకుందని అమర్నాథ్ గుర్తు చేశారు. గత ఎన్నికల్లో కొడుకును కూడా గెలిపించుకోలేని చంద్రబాబు నాయుడు పొత్తుల కోసం వెంపర్లాడుతున్నాడని అన్నారు.

జనసేన, టీడీపీ కలిసి పోటీ చేస్తాయి అన్న విషయాన్ని ఏడాది కిందటి నుంచే తాము చెబుతున్నామని.. ఇప్పటికి వారి మధ్య ఉన్న బంధం బయటపడిందని ఆయన అన్నారు. ఇన్ని పార్టీలు కలిసి మా పార్టీని ఢీకొట్టడానికి సిద్ధమవుతున్నాయంటే.. సీఎం జగన్ నాయకత్వంలోని వైసీపీ ఎంత బలమైనదో అర్థం చేసుకోవాలని ఆయన అన్నారు. జగన్ అత్యంత శక్తివంతుడు కాబట్టే చంద్రబాబు నాయుడు భయపడుతున్నాడని అమర్నాథ్ అన్నారు. మరొక ఎనిమిది నెలల్లో సాధారణ ఎన్నికలు రాబోతున్నాయని 2019 ఎన్నికల ఫలితాలు పునరావృతం అవుతాయని ఇందులో ఎవరికి ఎటువంటి అనుమానాలు అవసరం లేదని మంత్రి అమర్నాథ్ స్పష్టం చేశారు.


Tags:    

Similar News