పవన్ సంసారం బీజేపీతో.. సహజీవనం టీడీపీతో.. : మంత్రి గుడివాడ

అహంకారం, అసూయతో పవన్ కళ్యాణ్ విశాఖ వేదికగా సీఎం జ‌గ‌న్‌పై అస‌త్య‌ వ్యాఖ్యలు

Update: 2023-08-11 04:47 GMT

అహంకారం, అసూయతో పవన్ కళ్యాణ్ విశాఖ వేదికగా సీఎం జ‌గ‌న్‌పై అస‌త్య‌ వ్యాఖ్యలు చేశార‌ని ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విమ‌ర్శించారు. శుక్ర‌వారం ఆయ‌న మాట్లాడుతూ.. పవన్ ఆయ‌న‌ దత్త తండ్రి చంద్రబాబు మాత్రమే అధికారంలో ఉండాలన్న ఆలోచనతో ప్రసంగించారని అన్నారు. జనసేన పార్టీ గురించి గానీ.. పవన్ రాజకీయంగా ఎదగాలన్న ఆలోచన ఆయన ప్రసంగంలో లేదని అన్నారు. సిద్ధాంతం, విధానం.. రానున్న ఎన్నికల్లో పోటీ ప్రణాళిక పవన్ లో కనిపించలేదన్నారు.

సినిమాల్లో కథానాయకుడుగా మీ తీరు బాగుండొచ్చు కానీ.. రాజకీయాల్లో తగదని సూచించారు. జగన్ మోహన్ రెడ్డిని విమర్శిస్తే నాయకుడు అయిపోతారని అనుకుంటున్నారని అన్నారు. పవన్ కళ్యాణ్ ను చూస్తుంటే జాలి వేస్తుందని కామెంట్ చేశారు. అల్పుడు ఆడంబరంగా మాట్లాడునన్న వేమన పద్యం పవన్ కు సరిగ్గా సరిపోతుందని అన్నారు. పవన్ కళ్యాణ్ కు సిద్దాంతాలు లేవు.. ఒక్కో ఎన్నికలో ఒక్కో పార్టీ తో పొత్తు పెట్టుకుంటార‌ని విమ‌ర్శించారు. పవన్ కళ్యాణ్ సంసారం బీజేపీతో సహజీవనం టీడీపీతో చేస్తున్నారని ఎద్దేవా చేశారు.


Tags:    

Similar News