బాబు నుంచే పవన్‌కు ప్రాణహాని: మంత్రి కొట్టు

ఏపీలో రాజకీయాలు హాట్‌ హాట్‌గా సాగుతున్నాయి. తాజాగా జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై మంత్రి కొట్టు సత్యనారాయణ తీవ్ర విమర్శలు;

Update: 2023-06-18 10:20 GMT
Minister Kottu Satyanarayana, Pawan, Chandrababu, APnews
  • whatsapp icon

ఏపీలో రాజకీయాలు హాట్‌ హాట్‌గా సాగుతున్నాయి. తాజాగా జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై మంత్రి కొట్టు సత్యనారాయణ తీవ్ర విమర్శలు చేశారు. అవగాహన రాహిత్యంతో పవన్‌ మాట్లాడుతున్నారని అన్నారు. వారాహి యాత్ర పేరుతో అవాకులు, చెవాకులు పేలుతున్నాడని మండిపడ్డారు. మంత్రి కొట్టు ఆదివారం మీడియాతో మాట్లాడారు. పవన్‌ని ఎవరికైనా చూపించండిరా అని ప్రజలు అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కాపు సామాజిక వర్గాన్ని కించపర్చేలా మాట్లాడుతున్నాడని మంత్రి కొట్టు ఫైర్ అయ్యారు. చంద్రబాబు కాపుల ఓట్ల కోసం పవన్‌ను వాడుకుంటున్నాడని మంత్రి ఆరోపించారు.

పవన్ కల్యాణ్‌ వెంటన కాపులు రారని తెలిపారు. చంద్రబాబుతో ఉన్నావ్‌ కాబట్టే పవన్‌ నిన్ను ప్రజలు ఓడించారని అన్నారు. పవన్‌కు 175 నియోజకవర్గాల్లో పోటీ చేసే దమ్ముందా? అని ప్రశ్నించారు. పవన్‌ ప్రాణహాని ఉంటే అది చంద్రబాబు దగ్గర నుంచే ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. టీడీపీ హయాంలో కృష్ణా పుష్కరాల పేరిట 44 ఆలయాలను కూల్చేశారని, తమ పాలనలో 250 ఆలయాలకు రూ.281 కోట్లు కేటాయించామని మంత్రి కొట్టు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని విమర్శించారు. చంద్రబాబు.. తన పరిపాలన చూసి ఓటు వేయాలని అడిగే దమ్ము ఉందా? అంటూ నిలదీశారు.

జోకర్‌ లాంటి బాబు.. లోఫర్‌ లాంటి లోకేష్ మాటలు నమ్మొద్దని పవన్‌కు మంత్రి కొట్టు హితబోధ చేశారు. సీఎం వైఎస్‌ జగన్‌ను తిడితే.. ఆయనకు అధికారం కట్టబెట్టిన ప్రజలను తిట్టినట్లేనని, ఇది పవన్‌ తెలుసుకోవాలంటూ మంత్రి కొట్టు వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే.. తనకు ప్రాణహాని ఉందని, సుపారీ గ్యాంగులను దించారనే సమాచారం తన దగ్గర ఉందని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. జనసేన నాయకులతోపాటు కార్యకర్తలు, వీర మహిళలు కచ్చితంగా భద్రతా నియమాలు పాటించాలని సూచించారు. కాకినాడలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ నాయకుల సమావేశం జరిగింది. ఈ సమావేశం సందర్భంగా పవన్ ఈ కామెంట్స్ చేశారు.

Tags:    

Similar News