Andhra Pradesh : నిరుద్యోగ భృతిపై క్లారిటీ ఇచ్చిన మంత్రి మండిపల్లి
ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగ యువతకు ఇస్తామన్న భృతిపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు;

ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగ యువతకు ఇస్తామన్న భృతిపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. నిరుద్యోగ భృతి పథకంపై శాసనమండలిలో ప్రశ్నోత్తరాలో ఆయన ఈ విషయంపై సమాధానం ఇచ్చారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులకు నెలకు మూడు వేల రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామని కూటమి హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.
సభ్యుల ప్రశ్నకు...
అయితే దీనిపై సభ్యుల ప్రశ్నలకు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సమాధానమిచ్చారు. పారిశ్రామికీకరణ చేసి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించేలా తమ ప్రభుత్వం తొలుత చర్యలు తీసుకుంటుందని, ఆ దిశగా చర్యలు ప్రారంభించిందని తెలిపారు. ఉద్యోగం, ఉపాధి కల్పించలేనివారికి ప్రభుత్వం నిరుద్యోగ భృతి ఇస్తుందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు.