Nara Lokesh : జూనియర్ ఎన్టీఆర్ ప్లెక్సీతో లోకేశ్
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీని ప్రదర్శించడం చర్చనీయాంశమైంది;

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీని ప్రదర్శించడం చర్చనీయాంశమైంది. గన్నవరం వెళ్లిన లోకేశ్ కు టీడీపీ కార్యకర్తలు జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలతో స్వాగతం పలికారు. నిన్న గన్నవరంలో అశోక్ లేలాండ్ సంస్థ ప్రారంభోత్సవంలో పాల్గొన్నసమయంలో లోకేశ్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీని చూసిన ఆయన దానిని చేతికి అందుకున్నారు.
ఫ్లెక్సీ చేతిలో పట్టుకుని...
తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జూనియర్ ఎన్టీఆర్ ఫోటో ఫ్లెక్సీతో సందడి చేయనున్నారు. ఫ్లెక్సీని చేత్తో పట్టుకొని క్యాడర్ ను మంత్రి నారా లోకేష్ ఉత్తేజపర్చారు.జూనియర్ ఎన్టీఆర్ ఫొటోలతో టీడీపీ కార్యకర్తలు ప్రతి సమావేశంలో దర్శమిస్తుంటారు. దీంతో నారా లోకేశ్ కూడా వారిని ఉత్సాహపర్చేందుకు ఆ ఫ్లెక్సీని చేతపట్టుకోవడంతో మరింత ఉత్సాహంతో క్యాడర్ ఆనందంలో మునిగిపోయారు.