గుంటూరు మేయర్ ఎన్నిక కోసం ఏర్పాట్లు

గుంటూరు మేయర్‌ రాజీనామాతో ఎన్నిక అనివార్యమైంది. కౌన్సిల్ అత్యవసర సమావేశానికి ఏర్పాట్లు చేస్తున్నారు.;

Update: 2025-03-20 07:43 GMT
guntur mayor, election, arrangements, council
  • whatsapp icon

గుంటూరు మేయర్‌ రాజీనామాతో ఎన్నిక అనివార్యమైంది. కౌన్సిల్ అత్యవసర సమావేశానికి ఏర్పాట్లు చేస్తున్నారు. డిప్యూటీ మేయర్ అధ్వర్యంలోకౌన్సిల్ సమావేశం జరగనుంది. సమావేశం నిర్వహణ కోసం ప్రభుత్వ అనుమతిని కమిషనర్ కోరారు. సమావేశంలో మేయర్ ఎన్నిక కోసం తీర్మానం చేసి ఎన్నికల సంఘానికి, రాష్ట్రప్రభుత్వానికి కౌన్సిల్ పంపనుంది.

తీర్మానం అనంతరం...
తీర్మానం అనంతరం మేయర్ ఎన్నికతేదీ ఎన్నికల తేదీని ఎన్నికల సంఘం ప్రకటించనుంది. గుంటూరు కౌన్సిల్‌లో ప్రస్తుతం కూటమికే ఆధిక్యం ఉండటంతో మేయర్ పీఠం టీడీపీకే దక్కనుంది. గుంటూరు మేయర్ గా ఉన్న కావటి మనోహర్ నాయుడు రాజీనామా చేయడంతో ఎన్నిక అనివార్యమయింది. ఇప్పటికే అనేక మందివైసీపీ సభ్యులు కూటమి పార్టీల్లో చేరడంతో మేయర్ పదవిని టీడీపీ కైవసం చేసుకోనుంది.


Tags:    

Similar News