తిరుపతి తొక్కిసలాటపై కొనసాగుతున్నే విచారణ
తిరుపతి తొక్కిసలాటపై కొనసాగుతున్నే విచారణ;

ys jgans tour in tirumala
తిరుపతి తొక్కిసలాట ఘటనపై విచారణ కొనసాగుతుంది. వరసగా కమిషన్ ఈ ఘటనపై అధికారులను విచారిస్తున్నారు. తిరుపతిలో వైకుఠ ద్వార దర్శనం సందర్భంగా ఏర్పాటు చేసిన టోకెన్ల జారీ కేంద్రంలో తొక్కిసలాట జరిగి ఆరుగురు మరణించిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ ఘటనపై విచారించేందుకు కమిషన్ ను ఏర్పాటు చేసింది.
మూడు రోజుల పాటు.
తిరుపతిలో గత కొన్ని రోజుల నుంచి ఈ విచారణను కమిషన్ చేపట్టింది. వివిధ అధికారులను పిలిచి విచారణలో ఆరోజు తొక్కిసలాటకు జరిగిన కారణాలను తెలుసుకుంటుంది. ఈరోజు సీవీఎస్ఓ శ్రీధర్‌ను కమిషన్ విచారించనుంది. ఈ నెల 21 నుంచి 3 రోజుల పాటు 42 మంది విజిలెన్స్ సిబ్బందిని, 32 మంది పోలీసులను కమిషన్ విచారించనుంది.