వైసీపీ పాలనలో 4,300 కోట్ల దారి మళ్లింపు
వైసీపీ పాలనలో భారీగా ప్రాయోజిత పథకాల నిధులు దుర్వినియోగం జరిగిందని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఆరోపించా;

వైసీపీ పాలనలో భారీగా ప్రాయోజిత పథకాల నిధులు దుర్వినియోగం జరిగిందని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధుల్లో రూ 4,300 కోట్ల రూపాయలు దారి మళ్లించారని మంత్రి పయ్యావుల కేశవ్ వెల్లడించారు. శాసనసభలో ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా ఈ వివరాలను వెల్లడించారు.
వైసీపీ ప్రభుత్వ నిర్వాకంతో...
గత వైసీపీ ప్రభుత్వ నిర్వాకంతో ప్రత్యక్షంగా కన్నా పరోక్షంగా ఎక్కువ నష్టం వాటిల్లిందని మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. వైసీపీ హయాంలో రాష్ట్ర వాటా నిధులు ఇవ్వనందుకు కేంద్రం మూడు వందల కోట్ల రూపాయల మేరకు జరిమానా వేసిందని మంత్రి పయ్యావుల కేశవ్ చెప్పారు. గత ప్రభుత్వంలో మంచి కంటే చెడు ఎక్కువగా జరిగిందని పయ్యావుల ఆరోపించారు.