Nadendla Manohar : కాకినాడ పోర్టు స్మగ్లింగ్ డెన్ కు బాస్ ఎవరు?
కాకినాడ పోర్టును స్మగ్లింగ్ డెన్ గా గత వైసీపీ ప్రభుత్వం మార్చిందని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు;
కాకినాడ పోర్టును స్మగ్లింగ్ డెన్ గా గత వైసీపీ ప్రభుత్వం మార్చిందని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. గత మూడేళ్లలో కోటి 60 లక్షల కోట్ల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని కాకినాడ పోర్టు నుంచి ఎగుమతి చేశారన్నారు. కోవిడ్ సమయంలోనూ కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ప్రజలకు పంపిణీ చేయమని ఇచ్చిన బియ్యాన్ని ఇతర దేశాలకు ఎగుమతి చేస్తూ అక్రమార్జనకు పాల్పడ్డారన్నారు. గత ఐదేళ్లలో కాకినాడ పోర్టును బియ్యం ఎగుమతులకు కేరాఫ్ అడ్రస్ గా మార్చేశారన్నారు. కాకినాడ పోర్టులో గత ప్రభుత్వ హయాంలో కేవలం ఇరవై మంది పోలీసులను మాత్రమే పెట్టారన్నారు.
ఎవరో తెలిసే వరకూ...
పవన్ కల్యాణ్ కాకినాడ పోర్టు పర్యటనతో స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టయిందని నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఎందుకు జీఎంఆర్ నుంచిఎస్ఈఆర్ ను లాగేసుకోవాల్సి వచ్చిందని నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. ఆ స్మగ్లింగ్ డెన్ కు బాస్ ఎవరని నాదెండ్ల నిలదీశారు. కాకినాడ పోర్టుపై తాము ఎందుకు దృష్టి పెట్టామోప్రజలకు తెలియాలని నాదెండ్ల అన్నారు. పేదలకు పంపిణీ చేయాల్సిన బియ్యాన్ని పక్కదారి పట్టించెదవరో అందరికీ తెలియాలన్నారు. కాకినాడ పోర్టును అడ్డాగా చేసుకుని స్మగ్లింగ్ చేసే వారందరిపేర్లను బయటకు తీసుకువస్తామని నాదెండ్ల తెలిపారు.