Nara Lokesh : అధికారులపై నారా లోకేశ్ సీరియస్.. షోకాజ్ నోటీసులు జారీ
విద్యాశాఖ అధికారులపై మంత్రి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.;

విద్యాశాఖ అధికారులపై మంత్రి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పదో తరగతి పరీక్ష కేంద్రంలో అధికారుల చేసిన తప్పిదంతో ఒక దివ్యాంగురాలైన విద్యార్థి ఇబ్బందులు పడిన విషయం ఆయన దృష్టికి వచ్చింది. వెంటనే అధికారులపై మంత్రి లోకేశ్ ఆగ్రహం చేయడమే కాకుండా వారి వివరణ తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.
దివ్యాంగురాలికి మొదటి అంతస్తులో...
పదోతరగతి పరీక్ష కేంద్రాల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. పగిడ్యాల బాలికల గురుకుల పాఠశాల పరీక్షా కేంద్రంలో దివ్యాంగురాలైన టెన్త్ విద్యార్థినికి మొదటి ఫ్లోర్ గది కేటాయించడంతో ఆమె ఇబ్బందులు పడింది. ఆ విద్యార్థినికి అలా ఎలా మొదటి అంతస్తులో పరీక్ష రాసేలా అధికారుల చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. మంత్రి లోకేష్ సీరియస్ కావడంతో ఇద్దరు అధికారులకు షోకాజ్ నోటీసులను అధికారులు జారీ చేశారు.