అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఎండీతో నారా లోకేష్

అమెరికాలో మంత్రి నారా లోకేష్ పెట్టుబడుల పర్యటన కొనసాగుతోంది.

Update: 2024-10-30 02:40 GMT

అమెరికాలో మంత్రి నారా లోకేష్ పెట్టుబడుల పర్యటన కొనసాగుతోంది. లాస్ వెగాస్ లో ఐటి సర్వ్ సినర్జీ సదస్సుకు హాజరైన మంత్రి లోకేష్ అక్కడి ప్రాంగణంలో అమెజాన్ వెబ్ సర్వీసెస్ మేనేజింగ్ డైరక్టర్ రేచల్ స్కాఫ్ ను కలిసి ఏపీలో పెట్టుబడుల అవకాశాలను పరిశీలించాల్సిందిగా విజ్ఞప్తిచేశారు. ఈ సందర్భంగా రేచల్ స్కాఫ్ మాట్లాడుతూ... క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఎంటర్‌ప్రైజ్ సొల్యూషన్స్, డిజిటల్ ట్రాన్స్ ఫార్మేషన్ పై అమెజాన్ దృష్టి సారిస్తోంది. ప్రపంచ మార్కెట్ లో క్లౌడ్ సేవలు, పరిష్కారాలను విస్తరించడంలో తమ సంస్థ కీలక పాత్ర వహిస్తోందన్నారు. ఎఐ అండ్ ఎంఎల్, క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఆవిష్కరణలకు ప్రస్తుతం ప్రాధాన్యతనిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వాలు, భారీ పారిశ్రామిక సంస్థలకు అత్యాధునిక డిజిటల్ సొల్యూషన్స్ సేవలు అందజేయడంతోపాటు క్లౌడ్ కంప్యూటింగ్, స్టోరేజి, డేటా నిర్వహణ సేవల్లో అంతర్జాతీయంగా తమ సంస్థ పాత్ర కీలకమైందన్నారు.

డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ ....
మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో ఆంధ్రప్రదేశ్ డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ లక్ష్యాల సాధనకు ఏడబ్ల్యూఎస్ నాయకత్వం ఉపకరిస్తుందని తెలిపారు. స్మార్ట్ గవర్నెన్స్ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూపొందిస్తున్న ప్రణాళికల అమలులో ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ సేవలు కీలకపాత్ర వహించే అవకాశాలున్నాయన్నారు. ఎఐ & మిషన్ లెర్నింగ్ లో మీరు చూపిస్తున్న శ్రద్ధ, నిబద్ధతలు ఎపిని ఎఐ ఇన్నొవేషన్ కేంద్రంగా మార్చాలన్న తమ ఆశయానికి ఊతమిస్తాయని పేర్కొన్నారు. పునరుత్పాదక శక్తితో నడిచే క్లౌడ్ డేటా సెంటర్‌ల స్థిరత్వానికి ఏడబ్ల్యూఎస్ కట్టుబడి ఉండటం 2030 నాటికి ఆంధ్రప్రదేశ్ 72 GW పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి సాధించాలన్న మా లక్ష్యానికి అనుగుణంగా ఉందన్నారు. స్థిరమైన క్లౌడ్ కార్యకలాపాలకు పునరుత్పాదక ఇంధనాన్ని అందించేందుకు రాష్ట్రంలో బలమైన మౌలిక సదుపాయాలు, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు భరోసానిస్తాయని, ఈ-గవర్నెన్స్, స్మార్ట్ సిటీ, క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్‌లలో పని చేయడానికి శిక్షణ పొందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌లను అందించడం ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ కార్యక్రమాలకు మద్దతు ఇవ్వాలని లోకేష్ కోరారు.


Tags:    

Similar News