అప్ప‌టి కంటే ఎక్కువ మెజారిటీతో ప్రభుత్వాన్ని నిలుపుకోవాలి

జగన అన్న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసాక బడుగు బలహీన వర్గాలను అక్కున చేర్చుకున్నారని;

Update: 2023-08-08 02:52 GMT

జగన అన్న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసాక బడుగు బలహీన వర్గాలను అక్కున చేర్చుకున్నారని హోంమంత్రి తానేటి వనిత అన్నారు. తణుకు పట్టణంలో ఏఎంసీ ఛైర్మెన్ ప్రమాణ స్వీకారం సభలో ఆమె మాట్లాడుతూ.. అంబేద్క‌ర్ ఆశయాలకు అనుగుణంగా పరిపాలన చేపట్టారు.. కాబట్టి ఇంతమంది వెనకబడిన వారికీ రాజ్యాధికారం దక్కిందని పేర్కొన్నారు. కేబినెట్ లో 18 మంది ఎస్సీ, ఎస్టీ మైనారిటీలం ఉండటం గర్వించదగ్గ విషయమ‌న్నారు.

ఏ రాష్ట్రంలోనూ లేని వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చి జగన్ ప్రభుత్వం.. దళారీలు లేకుండా సంక్షేమాలు నేరుగా అందిస్తుంద‌న్నారు. విద్యా వ్యవస్థలో పెను మార్పులు తీసుకొచ్చి మెరుగైన విద్యా దీపాన్ని వెలిగించారని పేర్కొన్నారు. తల్లితండ్రుల బాధ్యతను మేనమామగా జగన్ తీసుకొన్నారని అన్నారు. విద్య విలువ తెలిసిన జగనన్న ఓట్లు లేని విద్యార్థులకు వేల కోట్లు ఖర్చు చేస్తున్నారని కొనియాడారు. మన బిడ్డలకు మంచి భవిష్యత్ ఇవ్వడం.. వెనక బడిన వర్గాలకు రాజ్యాధికారం కల్పించడం జగనన్నకే సాధ్యం అయ్యింద‌న్నారు. అందుకే మ‌నం 2019 కంటే ఎక్కువ మెజారిటీతో జగనన్న ప్రభుత్వాన్ని నిలుపుకోవాలని మంత్రి తానేటి వనిత పిలుపునిచ్చారు.


Tags:    

Similar News