అమరావతి రాజధాని తరలింపుపై నేడు విచారణ
రాజధాని అమరావతి తరలింపుపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. దీనిపై ధర్మాసనం నేడు విచారణ చేపట్టనుంది.
రాజధాని అమరావతి తరలింపుపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. దీనిపై ధర్మాసనం నేడు విచారణ చేపట్టనుంది. మొత్తం 57 పిటీషన్లను విచారించనుంది. రాజధాని తరలింపు చట్ట విరుద్ధమని, రైతులకు గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రస్తుత ప్రభుత్వం రాజధానిని అమరావతి నుంచి తరలిస్తుందంటూ అనేక పిటీషన్లు దాఖలయ్యాయి. దీనిపై విచారణ నేడు జరగనుంది.
మూడు రాజధానులను...
జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానుల ప్రతిపాదన తెచ్చింది. అమరావతిలో శాసన రాజధాని, కర్నూలులో న్యాయరాజధాని, విశాఖలో పరిపాలన రాజధానిని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు శాసనసభలో తీర్మానం చేసింది. దీనిపై రైతులతో పాటు మరికొందరు హైకోర్టును ఆశ్రయించారు.