రఘురామ కృష్ణరాజు కు ఎదురుదెబ్బ
ఎంపీ రఘురామ కృష్ణరాజుకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. రఘురామ పై సీఐడీ విచారణకు హైకోర్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.;
పార్లమెంటు సభ్యుడు రఘురామ కృష్ణరాజుకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. రఘురామ పై సీఐడీ విచారణకు హైకోర్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తనపై సీఐడీ నమోదు చేసిన పిటీషన్ ను కొట్టివేయాలని రఘురామ కృష్ణరాజు వేసిన పిటీషన్ ను హైకోర్టు తోసి పుచ్చింది. సీఐడీ విచారణకు హాజరు కావాలని రఘురామ కృష్ణరాజును ఆదేశించింది. హైదరాబాద్ లోని దిల్‌కుష్ గెస్ట్‌హౌస్ లో విచారణ చేసేందుకు హైకోర్టు అనుమతించింది.
సీఐడీ కేసును...
ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నందుకు సీఐడీ రఘురామ కృష్ణరాజు పై సీఐడీ కేసు నమోదు చేసింది. ఆయనను విచారించేందుకు నోటీసులు జారీ చేసింది. అయితే దీనిపై రఘురామ కృష్ణరాజు హైకోర్టు ను ఆశ్రయించారు. సీఐడీ కేసు కొట్టేయాలని కోరారు. దానిపై విచారించిన హైకోర్టు రఘురామ కృష్ణరాజు పిటిషన్ ను కొట్టేసింది.