తాడిపత్రిలో టెన్షన్.. టెన్షన్... జేసీ సొంత గ్రామంలో...?
తాడిపత్రిలో ఎంపీటీసీ ఎన్నిక టెన్షన్ గా మారింది. ఈరోజు ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
తాడిపత్రిలో ఎంపీటీసీ ఎన్నిక టెన్షన్ గా మారింది. ఈరోజు ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పోలీసులు భారీ బందోబస్తును ఉంచారు. తాడిపత్రి నియోజకవర్గం కావడంతో టీడీపీ, వైసీపీలు తమ పార్టీ కార్యకర్తలను భారీగా మొహరించాయి. తాడిపత్రి నియోజకవర్గంలోని పెద్దపప్పూరు మండలం జూటూరు ఎంపీటీసీ ఎన్నిక ఉద్రిక్తతకు దారితీసే అవకాశముందని భావించిన పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.
సొంత గ్రామం కావడంతో....
తాడపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిలు తమ వర్గాలను ఇప్పటికే దించాయి. జూటూరు జేసీ బ్రదర్స్ సొంత గ్రామం కావడంతో వారు ఈఎన్నికను మరింత ప్రిస్టేజ్ గా తీసుకున్నారు. పోలింగ్ కేంద్రం వద్ద 144 వ సెక్షన్ విధించారు. ఉద్రిక్తతలు తలెత్తకుండా పోలింగ్ ప్రశాతంగా జరిగేందుకు అందరూ సహకరించాలని పోలీసులు కోరుతున్నారు.