కొత్త కేబినెట్ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్

రెండ్రోజుల క్రితం సీఎం జగన్ ఆదేశాల మేరకు.. ఏపీ కేబినెట్ లోని 24 మంది మంత్రులు రాజీనామాలు చేశారు. రాజీనామాలు..;

Update: 2022-04-09 09:23 GMT
ys jagan, new cabinet, final list, governor
  • whatsapp icon

అమరావతి : ఏపీలో కొత్త కేబినెట్ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్సయింది. ఈనెల 11వ తేదీ సోమవారం ఉదయం 11.31 గంటలకు కొత్త కేబినెట్ మంత్రుల ప్రమాణ స్వీకారం ప్రారంభమవ్వనుంది. ఈ కార్యక్రమానికై అమరావతిలోని అసెంబ్లీ భవన సముదాయం పక్కన ఉన్న ఖాళీ స్థలంలో ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి.

రెండ్రోజుల క్రితం సీఎం జగన్ ఆదేశాల మేరకు.. ఏపీ కేబినెట్ లోని 24 మంది మంత్రులు రాజీనామాలు చేశారు. రాజీనామాలు చేసిన వారిలో కూడా కొందరు కొత్త కేబినెట్ లో ఉండవచ్చన్న ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. సీఎం కూడా ఇదే చెప్పారు. కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం దగ్గరపడుతోంది. ఇప్పటికే ఈ విషయంపై జగన్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.


Tags:    

Similar News