ఏపీకి తెలంగాణ ఐదువేల కోట్ల బాకీ
తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ కు ఐదు వేల కోట్ల రూపాయలు రావాల్సి ఉందని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ తెలిపారు
తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ కు ఐదు వేల కోట్ల రూపాయలు రావాల్సి ఉందని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ తెలిపారు.రాష్ట్ర విభజన జరిగి పదేళ్లయినా ఉమ్మడి ఆస్తుల విభజన ఇంకా పూర్తికాలేదని మంత్రి నారాయణ అన్నారు. ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ బోర్డు లెక్కల ప్రకారం తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ కు సుమారు 5,170 కోట్లు రావాల్సి ఉందని తెలిపారు.
ఉమ్మడి ఆస్తుల విభజన...
న్యాయస్థానాల్లో ఉన్న ఉమ్మడి ఆస్తులకు సంబంధించిన కేసులు త్వరగా పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ జనాభా ప్రాతిపదికన ఆస్తులు, అప్పులు పంపిణీ చేసుకోవాలని రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఉందన్నారు. ఇప్పటికైనా ఆస్తుల విభజనకు కేంద్రం పూనుకోవాలని ఆయన కోరారు.