కంటతడి పెట్టిన నారా లోకేష్

టీడీపీ నేత చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో జ్యుడీషియల్ రిమాండులో

Update: 2023-10-21 08:46 GMT

acb court seeking permission to arrest nara lokesh

టీడీపీ నేత చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో జ్యుడీషియల్ రిమాండులో ఉన్నారు. ఆయనను బయటకు తీసుకుని రావడానికి ఆయన తరపున లాయర్లు తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉన్నారు. ఆయనది అక్రమ అరెస్టు అంటూ టీడీపీ నేతలు అంటూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్ తన తండ్రి అరెస్టు, జైలులో ఇన్ని రోజులు పెట్టడం వెనుక కుట్రలు ఉన్నాయని ఆరోపిస్తూ ఉన్నారు. ఏ తప్పూ చేయని చంద్రబాబును ప్రభుత్వం కక్షపూరితంగా జైలులో పెట్టిందని నారా లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. గత 45 సంవత్సరాలుగా క్రమశిక్షణతో, పట్టుదలతో మనందరి కోసమే చంద్రబాబు నాయుడు పనిచేశారని లోకేశ్ అన్నారు. అలాంటి నేతను 43 రోజులుగా రాజమండ్రి జైలులోనే ఉంచారని చెప్పారు. తలుచుకుంటేనే దుఃఖం తన్నుకొస్తోందని లోకేశ్ ఆవేదన చెందారు. వ్యవస్థలను మేనేజ్ చేస్తూ ప్రజానాయకుడిని ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారో ఆలోచించాలని అన్నారు. తండ్రి పరిస్థితి గురించి చెబుతూ లోకేశ్ కన్నీటిపర్యంతమయ్యారు.

టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో జనసేనతో కలిసి టీడీపీ పోటీ చేయబోతోందని.. జనసేనాని పవన్ కళ్యాణ్ తో సమావేశమై భవిష్యత్ కార్యాచరణను నిర్ణయిస్తామని చెప్పారు. చంద్రబాబుకు పంపించే ఆహారంలో వారి కుటుంబ సభ్యులే ఏదైనా కలపొచ్చంటూ వైసీపీ మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. భోజనంలో విషం కలపడం, కోడికత్తి డ్రామాలు తమ కుటుంబ డీఎన్ఏలోనే లేవని చెప్పారు. విషం కలపడం, బాబాయ్ ని లేపేయడం వంటివి జగన్ డీఎన్ఏలో ఉన్నాయని అన్నారు. మీ కుటుంబంలోని విషయాలను బయటపెడితే తల ఎక్కడ పెట్టుకుంటావ్ జగన్ అని లోకేశ్ ప్రశ్నించారు. వ్యక్తిగత విషయాల జోలికి వెళ్లొద్దని, రాజకీయపరంగానే పోరాడాలని తమ అధినేత చంద్రబాబు చెప్పారని, అందుకే తాము సంయమనం పాటిస్తున్నామని అన్నారు. చంద్రబాబు జైల్లో ఉంటే టీడీపీ భయపడుతోందని జగన్ అంటున్నాడని... భయం అనేది టీడీపీ రక్తంలోనే లేదని లోకేశ్ చెప్పారు. వ్యవస్థలను మేనేజ్ చేసి టీడీపీని ఇబ్బంది పెడుతున్నారని.. చంద్రబాబు కుటుంబాన్ని ఇబ్బంది పెట్టడమే జగన్ లక్ష్యమని చెప్పారు.



Tags:    

Similar News