గవర్నర్ ను కలిసిన ఎన్డీఏ నేతలు..పింఛను పంపిణీపై
ఎన్డీఏ కూటమి నేతలు కూటమి నేతలు రాజ్ భవన్ లో గవర్నర్ ని కలిసి పింఛను పంపిణీ పై కలిసి ఫిర్యాదు చేశారు
ఎన్డీఏ కూటమి నేతలు కూటమి నేతలు రాజ్ భవన్ లో గవర్నర్ ని కలిసి ఫిర్యాదు చేశారు. ఈ వైసీపీ ప్రభుత్వం పెన్షన్ల పంపిణీ విషయంలో చేస్తున్న మొండి వైఖరి పై గవర్నర్ కి ఫిర్యాదు చేశారు. ఇంటింటికీ పెన్షన్లు పంపిణీ చేయాలని, బ్యాంకుల్లో జమ చేయవద్దని కోరినట్లు నేతలు తెలిపారు. ఎలక్షన్ కమిషన్ కూడా ఈ మేరకు ఆదేశాలు ఇచ్చిందని తెలిపారు. గతంలో జరిగిన రీతిలోనే పెన్షన్ల పంపిణీ చేయాలని ఎన్డీఏ నేతలు కోరారు. గత ఐదు సంవత్సరాలుగా పెన్షన్ దారులకు ఏవిధంగా అయితే పెన్షన్ ఇంటికే వెళ్లి ఇస్తున్నారో..అదే విధంగా ఒకటో తేదీ నుండి పెన్షన్లు ఇంటింటికీ వెళ్లి ఇవ్వాలని కోరామని తెలిపారు.
సిబ్బంది లేరనే సాకుతో...
సిబ్బందిలేరనే సాకుతో రాష్ట్రంలో శవ రాజకీయాలు చేస్తూ..,ఓట్లు కోసం ప్రభుత్వం ప్రయత్నిస్తుందని గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. అనేక రంగాలలో ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారని ,సచివాలయం సిబ్బంది 1.35 లక్షల మంది, 35 వేల మంది రెవెన్యూ సిబ్బంది, లక్ష 85 వేల మంది ఉపాధ్యాయులు ఉన్నారన్నారు. అంగన్వాడీ కార్యకర్తలు కూడా ఉన్నారని, వారందరినీ వినియోగించి పెన్షన్ల పంపిణీ చేయాలని కోరామని తెలిపారు. రాష్ట్రం వ్యాప్తంగా సుమారు 4 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారని, .వారి ఒక్కరూ 20 మందికి పంపిణీ చేస్తే సరిపోతుందని చెప్పామన్నారు. గత నెలలో 33 మంది చనిపోయారో..? అది పున:రావృతం కాకూడదని గవర్నర్ కు చెపినట్లు వారు తెలిపారు.